సునీతా విలియమ్స్ ను కొనియాడిన మంత్రి సురేఖ..! 1 y ago
TG: ఆమె సాహసం భారతావనికి గర్వకారణం అని భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ ను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ అన్నారు. దీనిపై సురేఖ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 9 నెలలు అంతరిక్షంలో గడిపి, భూమికి తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్ అని, ఆమె సాహసం భారతావనికి గర్వకారణమని కొనియాడారు. అంతరిక్ష విజ్ఞానానికి ఆమె చేసిన సాహసం, కృషికి గౌరవాన్ని తెలియజేస్తూ, భూమి నుండి అనంత విశ్వం వరకు వారు చేసిన ఈ మహత్తర ప్రయాణాన్ని చూసి భారత్ గర్విస్తుందని ఆమె తెలిపారు.